శృంగార సంకీర్తన
రేకు: 1001-1
సంపుటము: 20-1
రేకు: 1001-1
సంపుటము: 20-1
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
ఇంకా నేమౌనో ఇంతట నూరకుండవే కొంకఁబోఁగా నా గోరికొన దాఁకెఁగా | ॥పల్లవి॥ |
వొడివట్టి నేఁ దియ్యఁగా వోపనంటాఁ బెనఁగఁగా వెడఁగునీపోఁకముడి వీడెఁగా యిట్టె తొడికి కాఁగిలించఁగా తోదోపు లాడఁగాను పడఁతి నీకుచములు బయలాయఁగా | ॥ఇంకా॥ |
మోవినే నా కందియ్యఁగా మోరతోపై నీవుండఁగ భావించ నీమోవి నాపల్లు సోఁకెఁగా యీవల నేఁ బైకొనఁగా నిట్టునట్టు బొరలఁగా చేవ దేరే నీ కొప్పు చెంపలకు జారెఁగా | ॥ఇంకా॥ |
పచ్చడము నేఁ గప్పఁగా పంతాలు నీ వాడఁగాను మచ్చికరతుల సదమద మైతిగా ఇచ్చకాన శ్రీవేంకటేశుఁడ నేఁ గూడఁగాను వచ్చి వచ్చి నాకు లోనై వసమైతిగా | ॥ఇంకా॥ |