శృంగార సంకీర్తన
రేకు: 1002-2
సంపుటము: 20-8
రేకు: 1002-2
సంపుటము: 20-8
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
అట్టే మేలుకంటినే అదివో నేను గట్టిగా నే నిటువంటి కల గంటినే | ॥పల్లవి॥ |
తరుణికుచములపైఁ దగ నా మొగము మోపి గరిమ నే నిద్దరించఁ గల గంటినే పెరరేఁచి యాపె నన్నుఁ బేరుకొని పిలిచి కరఁగించి కూడెనంటాఁ గల గంటినే | ॥అట్టే॥ |
చిప్పిలేటిమోవి ఇచ్చి చెలియవదనమునఁ గప్పురము నే నందుకోఁ గల గంటినే మప్పరిఁ దప్పకచూచి ముదితపయ్యద నాకు కప్పెనంటా నిప్పుడిట్టే కల గంటినే | ॥అట్టే॥ |
మొక్కుచు నింతికి నేను ముంచినపెక్కురతులఁ గక్కసించితి నంటాఁ గల గంటినే యిక్కువతో శ్రీవేంకటేశుఁడఁగనక యాకె గక్కున నన్నుఁ గూడె నిక్కల గంటినె | ॥అట్టే॥ |