Display:
శృంగార సంకీర్తన
రేకు: 1086-1
సంపుటము: 20-511
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
నాయందుఁ గడమలేదు నమ్మించినవాఁడవు
చెయిమీఁదుగా నెట్టుసేసినా నీచిత్తము
॥పల్లవి॥
మొక్కలాన నే నిన్ను ముంచి యాడినమాఁటకు
మొక్కితిఁ బంతమిచ్చితి ముందుముందుగా
కక్కసించనోప దయగలిగినప్పుడు నీవే
మక్కువసేసి నన్ను మన్నింతువుగాక
॥నాయం॥
చలవట్టి నే నిన్ను జంకించినయందుకు
చెలఁగి నవ్వు నవ్వితి సెలవుగాను
బలిమిశాయఁగనోప బత్తిగలప్పుడే నీవే
పిలిచి కాఁగిట నించి పెనఁగేవుగాని
॥నాయం॥
ఆసపడి నిన్నుఁ గూడి అలయించినయందుకు
వాసితో మోవి యిచ్చితి వన్నెలుగాను
యీసుదీరె శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
రాసికెక్క నింకా నీవే రక్షించేవు గాని
॥నాయం॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము