Display:
శృంగార సంకీర్తన
రేకు: 1090-6
సంపుటము: 20-540
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
నీయందు నేరమి లేదు నే నెఱఁగనైతిఁగాక
ఆయమైన యెమ్మెకాఁడ వవుదువయ్యా
॥పల్లవి॥
మంతనాన నే నీతో మాటలాడినవియెల్ల
అంతరంగముగఁ జెప్పె నాపె నాతోను
యింతలోనే పెద్దరికా లేడేడ నాడుకొంటివి
అంతటిదొడ్డవాఁడ వవుదువయ్యా
॥నీయం॥
గుమితాన నీవు నేనుఁ గూడినకూటములెల్ల
అమరఁగ నాపె చెప్పె నందరితోను
రమణుఁడ నీవలపు రచ్చఁ బెట్టుకోవలెనా
అమసిఁన నిఁడుదొర వవుదువయ్యా
॥నీయం॥
ముచ్చట నీవును నేను మోహించినచేతఁలెల్లా
పచ్చిచేసేఁ జెలులతోఁ బై పై నాపై
అచ్చమై శ్రీవేంకటేశ అప్పటి నన్నుఁ గూడితిఁ
వచ్చుపడ జాణఁడ వౌదువయ్యా
॥నీయం॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము