శృంగార సంకీర్తన
రేకు: 1101-1
సంపుటము: 21-1
రేకు: 1101-1
సంపుటము: 21-1
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
ఇంకనేల బొంకనూ ఇద్దరముఁ గూడితిమి పొంకముగ నానతిమ్మా పూఁచి నవ్వే నేను | ॥పల్లవి॥ |
ఆసలురేఁచుక పోయి ఆకెమీఁద వేడుకతో సేసలు వెట్టితివా చెలరేఁగి వేసరక నమ్మించి వేగినంతాఁ దమకించి బాసలు సేసితివా పలుమారును | ॥ఇంక॥ |
చిక్కనినవ్వుతోడ సిగ్గులెల్లాఁ బెడఁబాయ చెక్కులు నొక్కితివా సేదలుదేర లక్కవలెఁ గరఁగఁగ లలనతో దూరుతాను మొక్కులు మొక్కితివా ముచ్చట దీరఁగను | ॥ఇంక॥ |
వలపులు చల్లి చల్లి వంతులు వాసులెంచక అలుకదేర్చితివా ఆపెను నీవు యెలమి శ్రీవేంకటేన యిటు నన్నుఁ గూడితివి అలరీ యీసుద్దు లాడ నాడుకొంటివా | ॥ఇంక॥ |