Display:
శృంగార సంకీర్తన
రేకు: 1130-1
సంపుటము: 21-170
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
మీరు నేరుతురు మీఁద మిక్కిలి గలితే
వారివీరి నడిగితే వంకలొత్తేరా
॥పల్లవి॥
చెప్పరాని చేఁతకు మీచిత్తములే గురిగాక
ఇప్పుడు మాకేల పెట్టి రింతేశానలు
తప్పులు దిద్దేమా మిమ్ము దండనుండేచెలులము
ముప్పిరి వేఁడుకొంటానే మొక్కేవారము
॥మీరే॥
గుట్టుతో మీపంతాలకు కొనగోళ్లే గురిగాక
బెట్టి మమ్మేల తోడుగాఁ బిలిచేరు
రట్టుసేసేమా మిమ్ము రచ్చల నిచ్చకులము
చుట్టపువరుసలే చూపేవారము
॥మీరే॥
నిండుమీకాఁగిళ్లకు నేరుపులే గురిగాక
దండివూడిగేలమాతోఁ దలపోఁతురా
కొండలశ్రీవేంకటేశ కోమలిఁ గూడితి విట్టె
మెండుతీసేయా మిమ్ము మెచ్చేవారము
॥మీరే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము