Display:
శృంగార సంకీర్తన
రేకు: 1130-2
సంపుటము: 21-171
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
ఏఁటికి నెగ్గులువట్టే విందుకు నీవు
కూటము గలుగుచోట గుట్టు మేలుగాదా
॥పల్లవి॥
తెగనాడరాదు గాక తెలిసిన ప లకు
నగరాదా నిన్నుఁజూచి నాకుఁ గొఁతైనా
జగడించవద్దుగాక చనవుగలుగుచోట
సగముచూపులు చూచి సాదించరాదా
॥ఏటి॥
పదరఁగరాదుగాక పాయరానిచోటికి
వొదిగి నివ్వెరగుతో నుండఁగరాదా
అదలించవద్దుగాక ఆసలెల్లఁ బెట్టుకోఁగ
వదలక అంతేశాల వద్దనఁగరాదా
॥ఏటి॥
గుఱి సేయరాదుగాక కూడినకూటములకు
చెఱఁగువట్టి బలిమి సేయఁగరాదా
యెఱిఁగి శ్రీవేంకటేశ యెనసితి విటు నన్ను
తఱి దూరవద్దుగాక తలపించరాదా
॥ఏటి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము