కీర్తనలు భద్రాచల రామదాసు అబ్బబ్బ దెబ్బలకు తాళలేరా రామప్ప గొబ్బున నన్నేలుకోరా
అసావేరి - ఆది
పల్లవి:
అబ్బబ్బ దెబ్బలకు తాళలేరా రామప్ప గొబ్బున నన్నేలుకోరా అ..
చరణము(లు):
మేలుచేయుదు నంటిగదరా మేలుచేసితినేమి భయమంటి గదరా
వరహాలు మొహరీలు జమజేస్తిగదరా నీ పరిచారకులకు నే పెట్టితిగదరా అ..
పరులకొక్కరువ్వ యీయలేదుగదరా ఓ పరమాత్మ నీ పాదముల్‌ నమ్మితిరా
కొరడాలు తీసుక గొట్టిరిగదరా హరనుత గోవింద హరితాళలేరా అ..
అంతటిలో నిన్ను నెరనమ్మినారా శరణాగత గోవింద హరితాళలేరా
శరధిబంధించిన శౌర్యమెక్కడరా రాక్షససంహార రక్షింపరారా అ..
రామ భద్రాద్రిసీతారామ రామా నీనామమెప్పుడు భజియించితిగదరా
రామదాసుని నిటుల చేయించితేరా అ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - abbabba debbalaku taaLaleeraa raamappa gobbuna nanneelukooraa ( telugu andhra )