కీర్తనలు భద్రాచల రామదాసు కమలనయన వాసుదేవ కరివరద మాంపాహీ
ఝంఝోటి - రూపక
పల్లవి:
కమలనయన వాసుదేవ కరివరద మాంపాహీ
అమలమృదుల నళిన వదనాచ్యుత ముదం దేహీ క..
చరణము(లు):
జారచోర మేరుధీర సాధుజనమందార
పారరహిత ఘోరకలుష భవజలధివిధుర క..
నారదాది గానలోల నందగోపబాల
వారిజాసనానుకూల మానిత గుణశీల క..
కామజనక శ్యామసుందర కనకాంబరధరణా
రామదాసవందిత శ్రీరాజీవాద్భుత చరణా క..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - kamalanayana vaasudeeva karivarada maaMpaahii ( telugu andhra )