కీర్తనలు భద్రాచల రామదాసు కలయె గోపాలం కస్తూరితిలకం సుఫాలం గోపాలం
సావేరి - ఆట ( - ఆది)
చరణము(లు):
కలయె గోపాలం కస్తూరితిలకం సుఫాలం గోపాలం
కుండలరుచిరకపోలం జలజసన్నిభకాంతి కాంతం
జగన్నాథపుర నిశాంతం క..
అనుపమరూపం మహితమణి కనకకలాపం గోపాలం
విగతగోప వనితానుతాపం మునిమనోజతరణిం
వనజసన్నిభచరణం క..
అమితద్విజాతం కరాంబుజం నవనీతం గోపాలం
కమలభవ భవమునిగీతం వివిధ కుసుమాలంకారం
విమల బృందావనహారం క..
భాసిత భానుం భద్రాద్రినివాసనిధానం శ్రీరామం
దివ్యానంద భాసురగానం రాసకేళి విరాజమానం
రామదాస స్తుతి నిధానం క..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - kalaye goopaalaM kastuuritilakaM suphaalaM goopaalaM ( telugu andhra )