కీర్తనలు భద్రాచల రామదాసు జయజానకీరమణ జయ విభీషణశరణ
నాట - ఝంప
చరణము(లు):
జయజానకీరమణ జయ విభీషణశరణ
జయ సరోరుహచరణ జయ దనుజహరణ జ..
జయ త్రిలోకశరణ్య జయ భక్తకారుణ్య
జయ గణ్యలావణ్య జయ జగద్గణ్య జ..
సకలలోకనివాస సాకేతపురవాస
అకళంక నిజహాస అబ్జముఖహాస జ..
శుకమౌనిస్తుతపాత్ర శుభరమ్యచారిత్ర
మకరకుండలకర్ణ మేఘసమవర్ణ జ..
కమనీయకంఠీర కౌస్తుభాలంకార
కమలాక్ష రఘువీర కలుషసంహార జ..
సమదరిపుజయధీర సకలగుణగంభీర
అమలహృత్సంచార అఖిలార్తిహార జ..
రూపనిర్జితమార రుచిసద్గుణశూర
భూపదశరథపుత్ర భూభూరహార జ..
పాపసంగవిదార పంక్తిముఖసంహార
శ్రీపతే సుకుమార సీతావిహార జ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - jayajaanakiiramaNa jaya vibhiishhaNasharaNa ( telugu andhra )