కీర్తనలు భద్రాచల రామదాసు నామనవిని విని వేగ ప్రాణనాథా
యదుకుల కాంభోజి - ఆది
పల్లవి:
నామనవిని విని వేగ ప్రాణనాథా
రామదాసుని వదలించుము ప్రాణనాథా నా..
చరణము(లు):
ప్రాచ్ఛాయ నేమ్లేచ్ఛుడు ప్రాణనాథా
తుచ్ఛతుచ్ఛ వాక్యము లాడెనయ్య ప్రాణనాథా నా..
దాసుని లక్ష పైకము దెమ్మనుచు ప్రాణనాథా
ఎంతో శిక్ష చేయుచునాడయ్య ప్రాణనాథా నా..
శరణన్న రక్షింతునని ప్రాణనాథా
శరణాగత బిరుదువహించిన ప్రాణనాథా నా..
తురక పైకము చెల్లించను ప్రాణనాథా
ఎంతో త్వరితముగ వేంచేయుడీ ప్రాణనాథా నా..
సీతాదేవి పలుకులకు చిత్తమందు రాములు
సంతసించి వెడలెను తమ్మునితో ముందు నా..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - naamanavini vini veega praaNanaathaa ( telugu andhra )