కీర్తనలు భద్రాచల రామదాసు భజరే శ్రీరామం హే మానస
నాదనామక్రియ - ఆది (కేదార - ఆది)
పల్లవి:
భజరే శ్రీరామం హే మానస
భజరే రఘురామం రామం భ..
చరణము(లు):
భజ రఘురామం భండనభీమం
రజనిచరాఘ విరామం రామం భ..
వనరుహ నయనం కనదహి శయనం
మనసిజ కోటిసమానం మానం భ..
తారకనామం దశరథ రామం
చారు భద్రాద్రీశ చారం ధీరం భ..
సీతారామం చిన్మయధామం
శ్రీ తులసీదళ శ్రీకరధామం భ..
శ్యామలగాత్రం సత్యచరిత్రం
రామదాస హృద్రాజీవ మిత్రం భ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - bhajaree shriiraamaM hee maanasa ( telugu andhra )