కీర్తనలు భద్రాచల రామదాసు మేలైన చిటికెన వ్రేలు ప్రాతఃకాలమందున గుట్టెతేలు
ఆనందభైరవి - రూపక
పల్లవి:
మేలైన చిటికెన వ్రేలు ప్రాతఃకాలమందున గుట్టెతేలు
చరణము(లు):
బాలత్వముననేను బావినీళ్ళకుపోయి
కాలుబెట్టగ చిన్న తేలుపొడిచెనయ్య మే..
చలివచ్చెనని నొప్పిచేత దీనివేడిమి పాపిష్టి ఘాత
యీలాగునైన నే నేలాగు తాళుదు మూలమైన గురుమూర్తి పాదములాన మే..
మిక్కిలి సలుపుచున్నది రాముగ్రక్కున నాదరించినది
వెక్కసపెట్టుచు కడతేరనీయదు మ్రొక్కెద నాస్వామి యోర్వగజాలను మే..
దరిజూపరా స్వామి కేశవా యిట్లు నరులుచేసినరీతి చేసెదవా
పుడమిలోపల భద్రగిరి రామదాసుని బడనీయక కాపాడు తండ్రివి నీవె మే..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - meelaina chiTikena vreelu praataHkaalamaMduna guTTeteelu ( telugu andhra )