కీర్తనలు భద్రాచల రామదాసు రామా దైవశిఖామణి సురరాజ మనోజ్జ్వల భూమణి రా..
తోడి - ఆట
పల్లవి:
రామా దైవశిఖామణి సురరాజ మనోజ్జ్వల భూమణి రా..
అను పల్లవి:
తామరసాక్ష సుధీమణీ భవ్యతారక భక్త చింతామణి రా..
చరణము(లు):
నాడే మిమ్ము వేడుకొంటిగా శరణాగత బిరుదని వింటిగా
వేడుక మిము బొడగంటిగా నన్ను దిగనాడ వద్దంటిగా రా..
చింతసేయగ నేమిలేదుగా ముందుజేసిన గతి తప్పబోదుగా
ఇంతకు మిక్కిలి రాదుగా నే నితరుల కొలిచేది లేదుగా రా..
తమ్ముడు నీవొక జంటను రామదాసుని రక్షించుటను
సమ్మతినుండు మా యింటను భద్రాచలవాస నీ బంటును రా..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - raamaa daivashikhaamaNi suraraaja manoojjvala bhuumaNi raa.. ( telugu andhra )