కీర్తనలు భద్రాచల రామదాసు రామా ననుబ్రోవగరాదా నన్ను గన్న సీతా
మధ్యమావతి - ఆది (- త్రిపుట)
పల్లవి:
రామా ననుబ్రోవగరాదా నన్ను గన్న సీతా
భామామణికైనను జాలిలేదా నామీద శ్రీ రా..
చరణము(లు):
రామయ్యా నీకిది మరియాదా రక్షించు భా
రమే మీకు లేదా శ్రీభద్రాచల
ధామ సుంతైననెనరు తలపున
ప్రేమ నుంచరాదా నాతో వాదా రా..
నీలోన జగములుండుగాక నీవు
లీలతో జగములో వుందువుగాక
ఏలాగు తాళుదు నెందాక ననుబ్రోవవు
యీలాగుండుట పరాకా ఎంతో వేడితి రా..
ఈనాటికెంతో సులభముగ నీవను పెన్ని
ధానము దొరికెను మాకు చేసిన పుణ్య
మాన నాకన్నులాన పరదైవాలను మ్రొక్కె
దనా బరువైనానా నీవాడనుగానా శ్రీ రా..
ఈ సమయమున రామదాసపోషక చిద్వి
లాస భద్రాచలవాస తెలిసి కృప
చేసి రక్షింప ప్రయాసా శ్రీరామా
గాసి మాన్పి బ్రోవకుండుటిది మేలా శ్రీ రా..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - raamaa nanubroovagaraadaa nannu ganna siitaa ( telugu andhra )