కీర్తనలు స్వాతి తిరుణాళ్‌ తోడయం - జయ దేవకీకిశోర! జయ కోటిస్మరాకార !
నాట - ఝంప
చరణము(లు):
జయ దేవకీకిశోర! జయ కోటిస్మరాకార !
జయ కాళిన్దీతటవిహార! జయ గోపికాజార ! ॥1॥
జయ జయ
జయ మురళీగానలోల! జయ సువర్ణరుచిచేల !
జయ సలీలధృతశైల! జయ వారిదనీల ! ॥2॥
జయ జయ
జయ చరిత్రధుతపాప ! జయ ఖణ్డితాసురాటోప !
జయ యాదవకులదీప ! జయ గోపాలరూప ! ॥3॥
జయ జయ
జయ కుటిలాసితకేశ ! జయ మునిమానసనివేశ !
జయ పఙ్కజనాభాధీశ ! జయ భూమీరమేశ ! ॥4॥
జయ జయ
AndhraBharati AMdhra bhArati - svAti tiruNAL kIrtanalu - tODayaM - jaya dEvakIkishOra! jaya kOTismarAkAra ! ( telugu andhra )