కీర్తనలు స్వాతి తిరుణాళ్‌ గణేశ గీతమ్‌ - పరిపాహి గణాధిప భాసురమూర్తే !
సావేరి / ఆది
పల్లవి:
పరిపాహి గణాధిప భాసురమూర్తే !
అనుపల్లవి:
శరణాగతభరణ సామజోపమ సున్దరాస్య
చరణము(లు):
హిమకిరణ శకల శేఖర తనుభవ
శమల నివహ శమన
కమలజముఖ సురవృన్ద నుత చరిత
కామితపూరక పాదసరోరుహ ॥1॥
మస్తక విగళిత దానజలమిలిత-
మధుకర సముదాయ
హస్త లసిత నిజదన్త మహిత సుగు-
ణాఖువహ గుహసోదర నిరుపమ ॥2॥
పావన పఙ్కజనాభ మనోహర
భగినేయ దేవ
సేవక జనతతివిద్యా సమధిక-
శ్రీ సుఖదాయక భూరి కృపాకర
AndhraBharati AMdhra bhArati - svAti tiruNAL kIrtanalu - gaNEsha gItam - paripAhi gaNAdhipa bhAsuramUrtE ! ( telugu andhra )