కీర్తనలు స్వాతి తిరుణాళ్‌ నవరాత్రి కీర్తనం 9 (తొమ్మిదవ రోజు) - పాహి పర్వతనన్దిని మామయి
ఆరభి - ఆది
పల్లవి:
పాహి పర్వతనన్దిని మామయి
పార్వణేన్దుసమవదనే
అనుపల్లవి:
వాహినీతటనివాసిని కేసరి-
వాహనే దితిజాళివిదారణే
చరణము(లు):
జంభవైరిముఖనతే కరి-
కుమ్భపీవరకుచవినతే వర-
శంభులలాటవిలోచనపావక-
సమ్భవే సమధికగుణవసతే ॥1॥
కఞ్జదళనిభలోచనే మధు-
మఞ్జుతరమృదుభాషణే మద-
కుఞ్జరనాయకమృదుగతిమఞ్జిమ-
భఞ్జనాతిచణమన్థరగమనే ॥2॥
చఞ్చదళిలలితాళకే తిల-
కాఞ్చితశశిధరకలాళికే నత-
వఞ్చినృపాలకవంశశుభోధయ-
సఞ్చయైకకృతిసతతగుణనికే ॥3॥
AndhraBharati AMdhra bhArati - svAti tiruNAL kIrtanalu - navarAtri kIrtanaM 9 (tommidava rOju) - pAhi parvatanandini mAmayi ( telugu andhra )