కీర్తనలు త్యాగరాజు అటుకారాదని బల్క నభిమానము లేకపోయెనా
మనోరంజని - ఆది
పల్లవి:
అటుకారాదని బల్క నభిమానము లేకపోయెనా అ..
అను పల్లవి:
ఎటులోర్తును ఓ దయఁజూడవయ్య
ఏ వేల్పు సేయు చలమో దెలిసి అ..
చరణము(లు):
వేదశాస్త్రోపనిషద్విదుఁడైన
నిజదారినిబట్టి దాసుఁడైన
నాదుపై నెపమెంచితే త్యాగరాజనుత అ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - aTukaaraadani balka nabhimaanamu leekapooyenaa ( telugu andhra )