కీర్తనలు త్యాగరాజు అది కాదు భజన, మనసా
యదుకుల కాంభోజి - ఆది
పల్లవి:
అది కాదు భజన మనసా! ॥అది॥
అను పల్లవి:
ఎదలో నెంచు టొకటి ప - య్యెద గల్గినచో నొకటి ॥అది॥
చరణము(లు):
గొప్ప తనముకై యాస
కుచ్చిత విషయ పిపాస
మెప్పులకై బహు వేస మిడి
ఉప్ప తిల్లెదరు; త్యాగరాజ వినుత! ॥అది॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - adi kaadu bhajana, manasaa ( telugu andhra )