కీర్తనలు త్యాగరాజు అనాథుఁడనుగాను రామ నే
జంగలా - ఆది
పల్లవి:
అనాథుఁడనుగాను రామ నే ॥న॥
అను పల్లవి:
అనాథుఁడవు నీవని నిగమజ్ఞుల
సనాతనులమాట విన్నాను నే ॥న॥
చరణము(లు):
నిరాదరపుఁజూచి ఈ కలి
నరాధములనేరు
పురాణపురుష పురరిపునుత నా
గరాట్ఛయన త్యాగరాజనుత నే ॥న॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - anaathu.rDanugaanu raama nee ( telugu andhra )