కీర్తనలు త్యాగరాజు అన్యాయము సేయకురా, రామ నన్నన్యునిగ జూడకురా
కాపి - ఆది
పల్లవి:
అన్యాయము సేయకురా రామ! న
న్నన్యునిగ జూడకురా; నాయెడ, రామ! ॥అన్యాయము॥
అను పల్లవి:
ఎన్నో తప్పులు గలవారిని, రా
జన్య! నీవు బ్రోచినావు గనుకను ॥అన్యాయము॥
చరణము(లు):
జడభరతుఁడు జింక శిశువునెత్తి బడలిక దీర్చగ లేదా?
కడలిని మునిగిన గిరి నొక కూర్మము గాపాడ లేదా?
పుడమిని పాండవ ద్రోహిని ధర్మ పుత్రుఁడు బ్రోవగ లేదా?
నడిమి ప్రాయమున త్యాగరాజనుత!
నా పూర్వజు బాధ దీర్ప లేదా? ॥అన్యాయము॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - anyaayamu seeyakuraa, raama nannanyuniga juuDakuraa ( telugu andhra )