కీర్తనలు త్యాగరాజు అమ్మ ధర్మసంవర్ధని, యాదుకోవమ్మ
అఠాణ - ఆది
పల్లవి:
అమ్మ ధర్మసంవర్ధని, యాదుకోవమ్మ మా ॥యమ్మ॥
అను పల్లవి:
ఇమ్మహిని నీ సరి యెవరమ్మ శివుని కొమ్మ మా ॥యమ్మ॥
చరణము(లు):
ధాత్రి! ధరనాయక ప్రియ
పుత్రి మదనకోటి మంజుళ
గాత్రి అరుణ నీరజదళ
నేత్రి నిరుపమ శుభ
గాత్రి పీఠనిలయె వర హ
స్తధృత వలయె పరమ ప
విత్రి భక్త పాలన ధురంధరి
వీరశక్తి నే నమ్మినా ॥నమ్మ॥
అంబ కంబుకంఠి చారుక
దంబ గహన సంచారిణి
బింబాధర తటిత్కోటి
నిభాభరి దయావారినిధే
శంబరారి వైరి హృచ్చంకరి
కౌమారి స్వరజిత
తుంబురు నారద సంగీత మాధుర్యె
దురితహారిణి మా ॥యమ్మ॥
ధన్యే త్ర్యంబకె మూర్థన్యె
పరమయోగి హృదయ
మాన్యె త్యాగరాజకుల శ
రణ్యె పతితపావని కా
రుణ్యసాగరి సదా అపరోక్షము
గారాదా సహ్య
కన్యా తీరవాసిని పరాత్పరి
కాత్యాయని రామసోదరి మా ॥యమ్మ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - amma dharmasaMvardhani, yaadukoovamma ( telugu andhra )