కీర్తనలు త్యాగరాజు అలక లల్లలాడఁగ గని ఆ రాణ్ముని ఎటు పొంగెనో
మధ్యమావతి - రూపకము
పల్లవి:
అలక లల్లలాడఁగ గని ఆ రాణ్ముని ఎటు పొంగెనో ॥అ॥
అను పల్లవి:
చెలువు మీఱఁగను మారీచుని మదమణఁచే వేళ ॥అ॥
చరణము(లు):
ముని కనుసైగఁ దెలిసి శివ - ధనువును విఱిచే సమయ
మున త్యాగరాజ విను - తుని మోమున రంజిల్లు ॥అ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - alaka lallalaaDa.rga gani aa raaNmuni eTu poMgenoo ( telugu andhra )