కీర్తనలు త్యాగరాజు ఆడమోడిగలదే రామయ్యమాట
చారుకేశి - దేశాది
పల్లవి:
ఆడమోడిగలదే రామయ్యమాట లా..
అను పల్లవి:
తోడునీడ నీవె యనుచు భక్తితోఁ
గూడి పాదములఁ బట్టినమాట లా..
చరణము(లు):
చదువులన్ని దెలిసి శంకరాంశుఁడై
సదయుఁడాశుగ సంభవుండు మ్రొక్క
గదలు తమ్ముని బల్కఁ జేసితివి
గాకను త్యాగరాజేపాటి మాట లా..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - aaDamooDigaladee raamayyamaaTa ( telugu andhra )