కీర్తనలు త్యాగరాజు ఇంత సౌఖ్యమని నేఁ జెప్పజాల
కాపి - ఆది
పల్లవి:
ఇంత సౌఖ్యమని నేఁ జెప్పజాల
ఎంతో యేమో యెవరికిఁ దెలుసునో? ఇం..
అను పల్లవి:
దాంత! సీతాకాంత! కరుణా
స్వాంత! ప్రేమాదులకే దెలుసునుగాని ఇం..
చరణము(లు):
స్వరరాగలయ సుధారసమందు
వర రామనామమనే కండ చ
క్కెర మిశ్రముఁజేసి భుజించే శం
కరునికి దెలుసును త్యాగరాజవినుత ఇం..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - iMta saukhyamani nee.r jeppajaala ( telugu andhra )