కీర్తనలు త్యాగరాజు ఇక గావలసిన దేమి మనసా? సుఖమున నుండవదేమి?
బలహంస - ఆది
పల్లవి:
ఇక గావలసిన దేమి మనసా? సుఖమున నుండవదేమి? ॥ఇక॥
అను పల్లవి:
అఖిలాండ కోటి బ్రహ్మాండనాథుఁ
డంతరంగమున నెలకొని యుండగ ॥నిక॥
చరణము(లు):
ముందటి జన్మములను జేసిన యఘ
బృంద విపినముల కా
నంద కందుఁడైన సీతాపతి
నందకాయుధుడై యుండగ ॥నిక॥
కామాది లోభ మోహ మద
స్తోమ తమమ్ములకును
సోమ సూర్య నేత్రుడైన శ్రీ
రామచంద్రుఁడే నీ యందుండగ ॥నిక॥
క్షేమాది శుభములను త్యాగరాజ
కామితార్థములను
నేమమున నిచ్చే దయానిధి
రామభద్రుఁడే నీయం దుండగ ॥నిక॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - ika gaavalasina deemi manasaa? sukhamuna nuMDavadeemi? ( telugu andhra )