కీర్తనలు త్యాగరాజు ఈవసుధ నీవంటి దైవము నెందు గానరా
శహాన - ఆది
పల్లవి:
ఈవసుధ నీవంటి దైవము నెందు గానరా ఈ..
అను పల్లవి:
భావుకము గల్గి వర్ధిల్లు కోవూరి సుందరేశ గిరీశ ఈ..
చరణము(లు):
ఆసచే యరనిమిషము నీ పుర వాసమొనరఁజేయువారి మది
వేసటలెల్లను దొలగించి ధన రాసుల నాయువును
భూసురభక్తియు తేజము నొసఁగి భువనమందుఁగీర్తి గల్గఁజేసె
దాసవరద త్యాగరాజ హృదయ నివాస చిద్విలాస సుందరేశ ఈ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - iivasudha niivaMTi daivamu neMdu gaanaraa ( telugu andhra )