కీర్తనలు త్యాగరాజు ఉపచారము జేసేవారున్నారని మరవకురా
భైరవి - రూపక
పల్లవి:
ఉపచారము జేసేవారున్నారని మరవకురా ఉ..
అను పల్లవి:
కృప కావలెనని నే నీ కీర్తిని పల్కుచు నుండఁగ ఉ..
చరణము(లు):
వాకిటనే పదిలముగా వాతాత్మజుఁడున్నాడని
శ్రీకరులగు నీ తమ్ములు చేరియున్నారని
ఏకాంతమునను జానకి ఏర్పడియున్నదని
శ్రీకాంత పరులేలని శ్రీ త్యాగరాజ వినుత ఉ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - upachaaramu jeeseevaarunnaarani maravakuraa ( telugu andhra )