కీర్తనలు త్యాగరాజు ఎంతముద్దో ఎంత సొగసో
బిందుమాలిని - ఆది
పల్లవి:
ఎంతముద్దో ఎంత సొగసో
ఎవరివల్ల వర్ణింపఁ దగునే ॥ఎం॥
అను పల్లవి:
ఎంతవారలైనఁగాని కామ
చింతాక్రాంతులైనారు ॥ఎం॥
చరణము(లు):
అత్తమీఁద కనులాసకు దాసులు
సత్త భాగవత వేసులైరి
దుత్త పాలరుచిఁ దెలియ సామ్యమె
ధురీణుఁడౌ త్యాగరాజ నుతుఁడు ॥ఎం॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - eMtamuddoo eMta sogasoo ( telugu andhra )