కీర్తనలు త్యాగరాజు ఎందు దాగినాఁడో ఈడకు రా
తోడి - త్రిపుట
పల్లవి:
ఎందు దాగినాఁడో ఈడకు రా
నెన్నడు దయవచ్చునో ఓ మనసా ఎం..
అను పల్లవి:
ఎందుకు చపలము వినవే నా మనవిని
ముందటివలె భక్తుల పోషించుట కెం..
చరణము(లు):
అలనాడు కనక కశిపు నిండారు
చలముఁజేసి సుతుని సకల బా
ధలఁ బెట్టగా మదిని దాళక ని
శ్చలుఁడైన ప్రహ్లాదుకొఱకు కంబములో
పల నుండఁగలేదా ఆ రీతిని నే డెం..
మును వారివాహ వాహన తనయుఁడు మద
మున రవిజుని చాలఁ గొట్టుటఁ జూచి
మనసు తాళఁజాలలేక ప్రేమ
మున పాలనముసేయ తాళతరువు మరు
గున నిల్వఁగలేదా రీతిని నే డెం..
తొలి జన్మముల నాఁడు జేసిన దుష్కర్మ
ముల నణఁగను సేయ ఆరుశ
త్రులఁబట్టి పొడిసేయ అదియుఁగాక
ఇలలో చంచలము రహిత నిజభక్త జ
నులను త్యాగరాజుని రక్షింప నే డెం..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - eMdu daaginaa.rDoo iiDaku raa ( telugu andhra )