కీర్తనలు త్యాగరాజు ఎందు కౌగిలింతురా? ని - న్నెంతని వర్ణింతురా?
శుద్ధదేశి - ఆది
పల్లవి:
ఎందు కౌగిలింతురా? ని - న్నెంతని వర్ణింతురా? ని ॥న్నెం॥
అను పల్లవి:
అందమైన కుందరదన - యిందిరా హృన్మందిరా! ని ॥న్నెం॥
చరణము(లు):
నీదు పలుకె పలుకురా నీదు కులుకే కులుకురా
నీదు తళుకే తళుకురా నిజమైన త్యాగరాజసుత! ని ॥న్నెం॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - eMdu kaugiliMturaa? ni - nneMtani varNiMturaa? ( telugu andhra )