కీర్తనలు త్యాగరాజు ఎవరున్నారు బ్రోవ
మాళవశ్రీ - దేశాది
పల్లవి:
ఎవరున్నారు బ్రోవ
ఇంత తామసమేలనయ్య ఎ..
అను పల్లవి:
వివరంబుగ దెల్పవయ్య
విశ్వేశ శ్రీ పంచనదీశ ఎ..
చరణము(లు):
మనసారగ ధ్యానింపను
మనసు నిలుపు మర్మంబు దెలిపి
తనవాడనే దలచి ధైర్య
మొసగు త్యాగరాజ వినుత ఎ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - evarunnaaru broova ( telugu andhra )