కీర్తనలు త్యాగరాజు ఎవ్వరే రామయ్య నీ సరి
గాంగేయభూషణి - దేశాది
పల్లవి:
ఎవ్వరే రామయ్య నీ సరి ఎ..
అను పల్లవి:
రవ్వకుఁ దావులేక సుజనులను
రాజిగ రక్షించే వా రె..
చరణము(లు):
పగవానికి సోదరుఁడని యెంచక
భక్తినెఱిగిఁ లంకాపట్టణ మొసగఁగా
నగధర సురభూసురపూజిత వర
నాగశయన త్యాగరాజవినుత సరి ఎ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - evvaree raamayya nii sari ( telugu andhra )