కీర్తనలు త్యాగరాజు ఏ దారి సంచరింతురా ఇఁకఁ బల్కురా
శృతిరంజని - దేశాది
పల్లవి:
ఏ దారి సంచరింతురా ఇఁకఁ బల్కురా ఏ..
అను పల్లవి:
శ్రీ దాది మధ్యాంత రహిత
సీతాసమేతగుణాకర నే నే..
చరణము(లు):
అన్ని తానను మార్గమునకు జనితే
నన్ను వీడను భారమని యనేవు
నన్నుఁ బ్రోవరా సదా యంటే
ద్వైతుఁడనేవు త్యాగరాజనుత ఏ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - ee daari saMchariMturaa i.rka.r balkuraa ( telugu andhra )