కీర్తనలు త్యాగరాజు ఏటి జన్మమిది హా ఓ రామ
వరాళి - చాపు
పల్లవి:
ఏటి జన్మమిది హా ఓ రామ ఏ..
అను పల్లవి:
ఏటి జన్మమిది యెందుకుఁ గలిగెనో
యెంతని సైరింతు హా ఓ రామ ఏ..
చరణము(లు):
సాటిలేని మారకోటి లావణ్యుని
మాటిమాటికిఁ జూచి మాటలాడని తన కే..
సారెకు ముత్యాల హార మురము పాలు
గారు మోమును గన్నులారఁ జూడని తన కే..
ఇంగితమెరిగని సంగీతలోలుని
పొంగుచుఁ దనివార గౌగలించని తన కే..
సాగరశయనుని త్యాగరాజనుతుని
వేగమె కూడక వేగేని హృదయము ఏ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - eeTi janmamidi haa oo raama ( telugu andhra )