కీర్తనలు త్యాగరాజు ఏటి యోచనలు చేసేవురా
కిరణావళి - దేశాది
పల్లవి:
ఏటి యోచనలు చేసేవురా
ఎదురుబల్కు వారెవరు లేరురా ఏ..
అను పల్లవి:
నోటిమాట జార్చఁగ రాదురా
కోటివేల్పులలో మేటియైన నీ వే..
చరణము(లు):
మెండుశూరులలో వెనుక తీయవని
రెండుమాటలాడేవాఁడు గాదని
అండకోట్లఁ బాలించేవాఁడని
చండమౌనులాడ త్యాగరాజనుత ఏ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - eeTi yoochanalu cheeseevuraa ( telugu andhra )