కీర్తనలు త్యాగరాజు ఏమని పొగడుదురా శ్రీరామ ని
వీరవసంత - ఆది
పల్లవి:
ఏమని పొగడుదురా శ్రీరామ ని ॥న్నే॥
అను పల్లవి:
శ్రీమన్నభోమణి వంశల
లామ భువనవాసీ మారామ ని ॥న్నే॥
చరణము(లు):
శివునికిఁ దామసగుణమిచ్చి కమల
భవునికి రాజసగుణమొసఁగి శచీ
ధవుని గర్వహృదయునిగాఁ జేసిన
దాశరథీ త్యాగరాజ వినుత ని ॥న్నే॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - eemani pogaDuduraa shriiraama ni ( telugu andhra )