కీర్తనలు త్యాగరాజు ఏమని మాట్లాడితివో రామ
తోడి - ఆది
పల్లవి:
ఏమని మాట్లాడితివో రామ
ఎవరి మనసుకే విధమో దెలిసి ఏ..
అను పల్లవి:
మామ మరుదులనుజులు తల్లిదండ్రులు
భామలు పరిజనులు స్వవశమౌట కే..
చరణము(లు):
రాజులు మునులు సురారులు వర ది
గ్రాజులు మరి శూరులు శశధరదిన
రాజులు లోబడి నడువను త్యాగ
రాజవినుత నయభయముగ ముద్దుగ ఏ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - eemani maaTlaaDitivoo raama ( telugu andhra )