కీర్తనలు త్యాగరాజు కంటఁజూడుమీ ఒకపరి క్రీ
లతాంగి - దేశాది
పల్లవి:
కంటఁజూడుమీ ఒకపరి క్రీ గం..
అను పల్లవి:
బంటుఁడై వెలయు బాగుగాని తప్పు
తంటలెల్ల మానుకొన్న నన్నుఁ గ్రీ గం..
చరణము(లు):
అలనాఁడు సౌమిత్రి పాదసేవ
చెలరేగి సేయువేళ సీతతోఁ
బలికిఁ జూచినంత పులకాంకితుఁడై
బరగిన యటు త్యాగరాజుని క్రీ గం..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - kaMTa.rjuuDumii okapari krii ( telugu andhra )