కీర్తనలు త్యాగరాజు కన్నతండ్రి నాపై కరుణమానకే గాసితాళనే
దేవమనోహరి - దేశాది
పల్లవి:
కన్నతండ్రి నాపై కరుణమానకే గాసితాళనే ॥క॥
అను పల్లవి:
నిన్నసేయుపనులు నేఁడుగాక వే
రెన్నలేదనుచు వేమాఱులకు ॥క॥
చరణము(లు):
ఎదురు తాననే ఇంగితం బెఱిఁగి
చెదరనీక పంచేంద్రియ మణంచి నిన్‌
వదలలేని ధైర్యశాలి గాదని
మదనకోటిరూప త్యాగరాజ నుత ॥క॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - kannataMDri naapai karuNamaanakee gaasitaaLanee ( telugu andhra )