కీర్తనలు త్యాగరాజు కలిగియుంటే గదా కల్గును
కీరవాణి - ఆది
పల్లవి:
కలిగియుంటే గదా కల్గును
కామితఫలదాయక క..
అను పల్లవి:
కలిని ఇంగిత మెఱుఁగక నిన్నాడుకొంటి
చలముచేయక నాతలను చక్కని వ్రాఁత క..
చరణము(లు):
భాగవతాగ్రేసరులగు నారద
ప్రహ్లాద పరాశర రామదాసులు
బాగుగ శ్రీరఘురాముని పదముల
భక్తిఁ జేసినరీతి త్యాగరాజుని కిపుడు క..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - kaligiyuMTee gadaa kalgunu ( telugu andhra )