కీర్తనలు త్యాగరాజు కొలువై యున్నాఁడే కోదండపాణి
భైరవి - ఆది
పల్లవి:
కొలువై యున్నాఁడే కోదండపాణి కొ..
అను పల్లవి:
తొలికర్మమణఁగఁ జూతాము రారే!
తోయజారి రోహిణిఁ గూడినరీతి కొ..
చరణము(లు):
మనసు రంజిల్ల సురసతులు
అణిమాదులు కొలువ వేయివన్నె
కనకశలాకను గేరు సీతా
కాంతతోను త్యాగరాజ వినుతుఁడు కొ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - koluvai yunnaa.rDee koodaMDapaaNi ( telugu andhra )