కీర్తనలు త్యాగరాజు కోటినదులు ధనుష్కోటిలో నుండఁగా
తోడి - ఆది
పల్లవి:
కోటినదులు ధనుష్కోటిలో నుండఁగా
ఏటికి తిరిగేవే ఓ మనసా ॥కో॥
అను పల్లవి:
సూటిగ శ్యామసుందరమూర్తిని
మాటిమాటికిఁ జూచే మహారాజులకు ॥కో॥
చరణము(లు):
గంగ నూపురంబునను జనించను
రంగనిఁ గావేరి గని రాజిల్లను
బొంగుచు శ్రీరఘునాథుని ప్రేమతోఁ
బొగడే త్యాగరాజు మనవి వినవే ॥కో॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - kooTinadulu dhanushhkooTiloo nuMDa.rgaa ( telugu andhra )