కీర్తనలు త్యాగరాజు కోరి సేవింపరారే కోర్కులీడేర
ఖరహరప్రియ - ఆది
పల్లవి:
కోరి సేవింపరారే కోర్కులీడేర కో..
అను పల్లవి:
శ్రీరమణీకరమౌ కోవూరి సుందరేశ్వరుని కో..
చరణము(లు):
సురులు వేయివన్నె బంగారు విరులచేఁ బూజింపఁగ భూ
సురులు సనకాది మౌనివరులు నుతింపఁగ
సిరులిత్తునని కొలువైయుండే శ్రీసౌందర్యనాయికా
వరుని శ్రీ త్యాగరాజవరదుని పరమాత్ముని హరుని కో..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - koori seeviMparaaree koorkuliiDeera ( telugu andhra )