కీర్తనలు త్యాగరాజు క్షీణమై తిరుగ జన్మించే
ముఖారి - ఆది
పల్లవి:
క్షీణమై తిరుగ జన్మించే
సిద్ధిమానరా ఓ మనసా క్షీ..
అను పల్లవి:
గీర్వాణ నాటకాలంకార వేద పు
రాణ యజ్ఞజపతపాదుల ఫలములు క్షీ..
చరణము(లు):
ఏది చేసిన జగన్నాథుఁడు శిరమున
హృదయమున వహించి
పదిలమైన సత్పదము నొసంగే బాట
త్యాగరాజవినుతుని భజనరా క్షీ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - xiiNamai tiruga janmiMchee ( telugu andhra )