కీర్తనలు త్యాగరాజు గిరిపై నెలకొన్న రాముని గురితప్పక గంటీ
శహాన - ఆది
పల్లవి:
గిరిపై నెలకొన్న రాముని గురితప్పక గంటీ గి..
అను పల్లవి:
పరివారులు విరిసురటులచే నిల
బడి విసరుచుఁ కొసరుచు సేవింపఁగ గి..
చరణము(లు):
పులకాంకితుఁడై యానందాశ్రు
వుల నింపుచు మాటలాడవలెనని
కలువరించఁగని పదిపూటలపైఁ
గాచెదనను త్యాగరాజవినుతుని గి..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - giripai nelakonna raamuni guritappaka gaMTii ( telugu andhra )