కీర్తనలు త్యాగరాజు గీతార్థము సంగీతానందము
సురటి - దేశాది
పల్లవి:
గీతార్థము సంగీతానందము
నీ తావునఁ జూడరా ఓ మనసా ॥గీ॥
అను పల్లవి:
సీతాపతి చరణాబ్జము లిడుకొన
వాతాత్మజునికి బాగతెలుసురా ॥గీ॥
చరణము(లు):
హరిహర భాస్కర కాలాది కర్మము
లను మతముల మర్మముల నెఱింగిన
హరి వరరూపుఁడు హరి హయ వినుతుఁడు
వర త్యాగరాజ వరదుఁడు సుఖిరా ॥గీ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - giitaarthamu saMgiitaanaMdamu ( telugu andhra )