కీర్తనలు త్యాగరాజు గ్రహబలమేమి శ్రీరామానుగ్రహబలమే బలము
రేవగుప్తి - దేశాది
పల్లవి:
గ్రహబలమేమి శ్రీరామాను, గ్రహబలమే బలము ॥గ్రహ॥
అను పల్లవి:
గ్రహబలమేమి తేజోమయ వి
గ్రహమును ధ్యానించు వారికి నవ ॥గ్రహ॥
చరణము(లు):
గ్రహపీడల పంచపాపముల నాగ్రహములు గల
కామాదిరిపుల నిగ్రహము జేయు హరిని భజించు
త్యాగరాజునికి రసికా గ్రేసరులకు ॥గ్రహ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - grahabalameemi shriiraamaanugrahabalamee balamu ( telugu andhra )